Skin Care Tips:ముఖానికి వేసుకొనే మేకప్ ముఖ సౌందర్యానికి మరింత వన్నెను తెస్తుంది. అయితే
మంచి మేకప్ కావాలంటే దానికి సరైన ఫౌండేషన్ ఎన్నుకోవాలి. మేకప్ ఎక్కువసేపు మీముఖం మీద ఉండాలంటే తప్పనిసరిగా ఫౌండేషన్ అవసరం.
ఫౌండేషన్ రెండు రకాలుగా ఉంటుంది. డ్రై స్కిన్ వారి కోసం మాయిశ్చరైజర్ తో కూడిన ఫౌండేషన్ ఉంటుంది. ఆయిల్ స్కిన్ కోసం ఆయిల్ ఫ్రీ ఫౌండేషన్ ఉంటుంది. మీ చర్మానికి సరిపడ ఫౌండేషన్ ని ఎన్నుకోండి.
ఒక వేళ ఫౌండేషన్ ఎక్కువసేపు ఉండాలని అనుకుంటే ముఖంపై ఐస్ ముక్కలతో కొద్దిసేపు రబ్ చేసి ఆ తర్వాత ఫౌండేషన్ పెట్టాలి.
ఎలా ఉపయోగించాలి?
డ్రై స్కిన్ : ఫౌండేషన్ పెట్టటానికి ముందు ముఖాన్ని క్లిన్సింగ్ మిల్క్ తో శుభ్రం చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని టోనింగ్ చేయండి. మాయిశ్చరైజర్ ను ఫౌండేషన్ లో కలిపి ముఖంపై పెట్టుకోండి.
ఆయిలీ స్కిన్ : ఈ రకమైన చర్మంపై నేరుగా ఫౌండేషన్ పెట్టవచ్చు. ఫౌండేషన్ ను క్లిన్సింగ్ మిల్క్ లేదా ఫేస్ వాష్ సాయంతో తొలగించండి. ఈ జాగ్రత్తలు అన్ని తీసుకుంటే మీరు వేసుకున్న మేకప్ ఎక్కువసేపు ఉంటుంది.

