Banana Buns:మార్నింగ్ టిఫిన్స్ కోసం వెరైటీ కావాలి అనుకునే వారు. బనానా బన్స్ తయారు చేసుకోండి. ఈజీ ,హెల్తీ అండ్ టేస్టీ బనానా బన్స్ ని మీ టిపిన్ మెనులోకి చేర్చుకోండి.
కావాల్సిన పదార్ధాలు
గోధుమ పిండి – 1 ½
అరటి పండు – 1
పెరుగు – ¼ కప్పు
చక్కెర – చిటికెడు
ఉప్పు – చిటికెడు
జీలకర్ర – 1 టీ స్పూన్
బటర్ – తగినంత
తయారీ విధానం
1.ఒక మిక్సింగ్ బౌల్ లోకి అరటి పండును ముక్కలు చేసి వేసుకోవాలి.
2.మెత్తగా చేసుకోని అందులోకి చక్కెర ,ఉప్పు,పెరుగు వేసి బాగా బీట్ చేసుకోవాలి.
3.అందులోకి జీలకర్ర,బటర్ ,చిటికెడు బేకింగ్ సోడా ,గోధుమ పిండిని వేసి మెత్తగా కలుపుకోవాలి.
4.ఇప్పుడు కలుపుకున్న పిండిని ఆరు నుంచి ఏడు గంటలు నాననివ్వాలి.
5.మార్నింగ్ టిఫిన్ కోసం ప్రిపరేషన్ నైట్ చేసి పెట్టుకోవాలి.
6.మార్నింగ్ నానిన అరటి పండు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకోని మందపాటి పూరీల వత్తుకోవాలి.
7.సట్టవ్ పై బాండీ పెట్టుకోని డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేడి చేసి అందులోకి తయారు చేసుకున్న బన్స్ ని వేయాలి.
8.నూనే లో వేసిన అరటి బన్స్ ఉబ్బడం మొదలు పెడ్తాయి.
9.రెండు వైపులా ఎర్రగా కాల్చుకోని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.

