Millet Pulihora :ఆరోగ్యానికి ఆరోగ్యం రుచి కి రుచి కొర్రల పులిహోర.. ఒకసారి తింటే అసలు వదిలిపెట్టరు

Millet Pulihora : పులిహోర అంటే చాలు అందరు ఇష్టపడ్తారు. స్పెషల్ ఏమి అవసరం లేదు.రెగ్యులర్ గా కాకుండా కొర్రలతో పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
కొర్రలు – 1 కప్పు
నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్
పల్లీలు – 1 టేబుల్ స్పూన్
మినపప్పు – 1 టేబుల్ స్పూన్
శగనపప్పు – 1 టేబుల్ స్పూన్
ఆవాలు- 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
పచ్చిమిర్చి 2-3
కరివేపాకు – ½ కప్పు
పసుపు -1/2 టీ స్పూన్
ఇంగువ – చిటికెడు
ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం
1.కొర్రలను ఐదు నుండి ఆరుగంటలు నానబెట్టుకుంటే మంచిది లేదంటే గంటపాటు నానబెట్టుకోవాలి.

2.ఒక కప్పు కొర్రలకు రెండు కప్పుల నీళ్లు తీసుకోని నానబెట్టుకోవాలి.

3.రాత్రంతా నానిన కొర్రలను నీళ్లతో పాటుగా ప్రెజర్ కుక్కర్ లో వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

4.ప్రెషర్ పోయిన తర్వాత అన్నం వేరొక గిన్నెలోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి.

5.ఇప్పుడు తాలింపు కోసం టేబుల్ స్పూన్ నూనే వేడి చేసి అందులోకి పల్లీలు,ఎండుమిర్చి,శనగ పప్పు,ఆవాలు ,జీలకర్ర వేసి వేపుకోవాలి.

6.ఇప్పుడు అందులోకి పచ్చిమర్చి చీలికలు,కరివేపాకు,పసుపు ,చిటికెడు ఇంగువ వేసి తాలింపును బాగా వేపుకోవాలి.

7.వేగిన తాలింపులోకి చల్లారిన కొర్రల అన్నం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

8.అంతే కొర్రల పులిహోరా రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top