Semiya Boorelu:సేమియా బూరెలు ఈ కొలతల్లో టిప్స్ తో చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి

Semiya Boorelu:పండుగలకు,పూజలకు కోసం చేసుకునే బూరెలు సేమియాతో ఎప్పుడైన ట్రై చేసారా.

కావాల్సిన పదార్ధాలు

మినపప్పు – 1 కప్పు
బియ్యం – 1 ½ కప్పు
ఉప్పు – ½ టీ స్పూన్
చక్కెర – 2 టీ స్పూన్
ఇడ్లీ రవ్వ – 1/2 టీ స్పూన్స్
సేమియా – 1 కప్పు
చక్కెర – ¾ కప్పు
డ్రై ఫ్రూట్స్ – తగినన్ని
యాలకుల పొడి – ½ టీ స్పూన్

తయారీ విధానం

1.ముందుగా ప్యాన్ పెట్టుకోని నెయ్యిన కరిగించి డ్రై ఫ్రూట్స్ ని వేపుకుని పెట్టుకోవాలి.

2.అదే ప్యాన్ లో సేమియాను కూడ వేపుకోని పక్కన పెట్టుకోవాలి.

3.ఒక కప్పు సేమియా కోసం రెండు కప్పుల నీళ్లను వేసుకోని మరగనివ్వాలి.

4.మరుగుతున్న ఎసరులో వేపుకున్న సేమియాను వేసి ఉడకించాలి.

5.ఉడుకుతున్న సేమియాలోకి చక్కెర వేసి దగ్గరపడే వరకు ఉడికించాలి.

6.ఇప్పుడు ఇందులోకి అవసరం అనుకుంటే కొబ్బరి తురుము,యాలకుల పొడి వేసి పూర్తిగా చిక్కపడే వరకు ఉడికించుకోవాలి.

7.ఇప్పుడు బూరెల స్టఫింగ్ రెడీ అయిపోయింది.

8.ఇప్పుడు బూరెల పిండి కోసం మినపప్పు ,బియ్యాన్ని రాత్రంత నానబెట్టుకోవాలి.

9.నానబెట్టుకున్న మినపప్పును గ్రైండ్ చేసుకోని బ్యాటర్ గిన్నెలోకి తీసుకోవాలి.

10.అవసరమైనంత పిండిని తీసుకోని అందులోకి ఉప్పు,చక్కెర,ఇడ్లీ రవ్వ వేసి బ్యాటర్ ని మిక్స్ చేసుకోవాలి.

11. రెండు చేతులపై ఆయిల్ రాసుకోని కొద్దిగా సేమియా స్టపింగ్ తీసుకోని చిన్న బాల్స్ గా తయారు చేసుకోని బ్యాలర్ లో కోట్ చేసుకోని బూరెలను వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.

12.అంతే సేమియా బూరెలు రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top