Paneer Green Masala:పక్కా ఢాబా స్టైల్ పనీర్ కర్రీ అన్నం,చపాతీ,రోటి లోకి గా తినేయచ్చు

Paneer Green Masala:పుష్టిగా ప్రోటీన్స్ కలిగిన పన్నీర్ వారంలో ఒక సారైనా తీసుకుంటే ఆరోగ్యానికి పోషకాలు అందుతాయి.వెజ్ ప్రియుల కైతే పన్నీర్ అంటే స్పేషలనే చెప్పాలి.పన్నీర్ గ్రీన్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
పన్నీర్ – 300 గ్రాములు
పచ్చిమిర్చి 4-5
ఉల్లిపాయలు -1
టొమాటోలు – 1
గరం మసాలా – తగినంత
వెల్లుల్లి రెబ్బలు – 4-5
అల్లం – 4 ఇంచ్ లు
కారం – ½ టీ స్పూన్
ఉప్పు – 1 టీ ఈస్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్
జీలకర్ర పొడి – ¼ టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
పుదీనా ఆకులు – ¼ కప్పు
కొత్తిమీర – ¼ కప్పు
కసూరీ మేథీ – 1 టీ స్పూన్
పెరుగు – ½ కప్పు

తయారీ విధానం
1.ముందుగా పన్నీర్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోని ప్యాన్ నూనే వేడి చేసి గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేపుకోని పక్కన పెట్టుకోవాలి.

2.ఇప్పుడు గ్రీన్ మాసాల కోసం 1 టీ స్పూన్ ఆయిల్ వేడి చేసి అందులోకి హోల్ గరం మాసాలా వేపుకోవాలి.

3.అందులోకి ఉల్లిపాయల ముక్కలు వేసి దోరగా వేపుకోవాలి.

4.వేగిన ఉల్లిపాయల్లోకి వెల్లుల్లి ,అల్లం,పచ్చిమిర్చి ,టోమాటో ముక్కలు వేసి రెండు,మూడు నిమిషాలు వేపుకోవాలి.

5.ఇప్పుడు అందులోకి పుదీనా ,కొత్తిమీర మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోని చల్లారిన తర్వాత మిక్సి జార్ లో వేసుకోని పేస్ట్ ల గ్రైండ్ చేసుకోవాలి.

6.ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి పచ్చిమిర్చి వేసి వేగాక గ్రైండ్ చేసుకున్న గ్రీన్ మసాలా పేస్ట్ ని కలుపుకోవాలి.

7.అందులోకి కారం,ఉప్పు ,జీలకర్ర పొడి,కప్పు పెరుగు,పసుపు గ్రేవి కోసం కొద్దిగా నీళ్లు పోసుకోని ఉడకనివ్వాలి.

8.ఇప్పుడు గ్రేవీలోకి కసూరి మేథీని నలుపుకోని వేసుకోవాలి.

9.గ్రేవీ చిక్క పడ్డ తర్వాత వేపుకున్న పన్నీర్ ముక్కలను వేసి లో ఫ్లేమ్ పై ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

10. అంతే పన్నీర్ గ్రీన్ మసాలా కర్రీ రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top