Sweet Pongal:పండుగలు పూజలకు స్వీట్ కంపల్సరీ. సేమియా,రవ్వకేసరి లాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా స్వీట్ పొంగల్ తయారు చేసుకోండి. స్వీట్ పొంగల్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
బియ్యం – 1 కప్పు
పెసరపప్పు – ½ కప్పు
నీళ్లు – 2 కప్పులు
పాలు -3 కప్పులు
నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్
యాలకుల పొడి – 1 టీ స్పూన్
డ్రై ఫ్రూట్స్ –తగినన్ని
తయారీ విధానం
1.ముందుగా బియ్యం,పెసరపప్పు అరగంట పాటు నానబెట్టుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనే వేడి చేసి డ్రై ఫ్రూట్స్ ని వేపుకోని పక్కన పెట్టుకోవాలి.
3.నానబెట్టిన పప్పు, బియ్యం లో రెండు కప్పుల నీళ్లు పోసి ఉడకనివ్వాలి.
4.ఉడికుతున్న అన్నంలో మూడు కప్పుల పాలు కలుపుకోవాలి.
5.నెమ్మదిగా కలుపుతూ అన్నం ఉడికించుకోవాలి.
6.ఇప్పుడు అందులోకి బెల్లం తురుము వేసి కలుపుకోవాలి.
7.అలాగే ½ కప్పు తురుమిన కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ,యాలకుల పొడి వేసి ,రెండు టేబుల్ స్పూన్స్ చక్కెర వేసి బాగా కలుపుకోవాలి.
8.చివరగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కలుపుకోని వేడి వేడి గా పొంగల్ స్వీట్ సర్వ్ చేసుకోవడమే.

