Semiya Upma:సేమ్యా ఉప్మా కుక్కర్ లోఇలా చేస్తే పొడి పొడిగా,చాలా రుచిగా వస్తుంది


Semiya Upma:ఇడ్లీ ,దోశ పిండి రెడీగా లేవంటే ఈజీగా చేసుకునే టిఫిన్ ఉప్మా. సేమీయా ఉప్మా కుక్కర్ లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
సేమియా – 2 కప్పులు
ఉల్లిపాయలు – 1
టమోటో – 2
బంగాళదుంపలు – 1
పచ్చిమిర్చి – 5-6
మినపప్పు – 1 టీ స్పూన్
శగనపప్పు – 1 టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
అల్లం తరుగు – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
నూనే – 1 టేబుల్ స్పూన్
బటర్ లేదా నెయ్యి – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా సేమియాను వేపుకుని పక్కన పెట్టుకోవాలి.
2.ఇప్పుడు కుక్కర్ లోకి నెయ్యి ,నూనె ను వేసి అందులోకి ఎండుమిర్చి ,శనగపప్పు,జీలకర్ర,ఆవాలు,అల్లం తరుగు వేసి రంగు మారే వరకు వేపుకోవాలి.
3.అందులోకి పచ్చిమిర్చి,ఉల్లిపాయ తరుగు వేసి వేపుకోవాలి.
4.ఉల్లిపాయలు వేగాక టమాటో ముక్కలు ,బంగాళదుంపలు వేసి రెండు,మూడు నిమిషాలు వేపుకోవాలి.
5.రెండు కప్పుల సేమియా కై మూడు కప్పుల నీల్లు యాడ్ చేసుకోవాలి.
6.ఎసరులో ఉప్పు వేసి బాగా కలుపుకోని ఎసరు మరగనివ్వాలి.
7.మరిగే ఎసరులో వేపుకున్న సేమియాను వేసి కలుపుకోని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు లోఫ్లేమ్ పై ఉడికించాలి.
8.ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి వేడి వేడి సేమియా ఉప్మాను సర్వ్ చేసుకోవడమే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top