Bangaladumpa Vepudu: పప్పు,సాంబార్ లోకి సైడ్ డిష్ గా ఆలు ఫ్రై చేసుకుంటే కాంబినేసన్ అదిరి పోతుంది. చిటికెలో తయారు చేసుకోని పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
బంగాళాదుంపలు – ½ kg
ఉల్లిపాయలు – 1
పచ్చిమిర్చి – 2
పసుపు – ½ టీ స్పూన్
కారం – 1 స్పూన్
ఉప్పు – తగినంత
జీలకర్ర – ½ టీ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
మినపప్పు – 1 టీ స్పూన్
ఎండు మిర్చి – 1
కరివేపాకు – ½ కప్పు
తయారీ విధానం
1.ముందుగా బంగాళదుంపలను ఉడకబెట్టిం తొక్క తీసుకోని సన్నగా తురిమి పెట్టుకోండి.
2.అందలోకి ఉప్పు,పసుపు,కారం వేసి బాగా కలుపుకోని పదినిమిషాలు పక్కన పెట్టుకోండి.
3.ఇప్పడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి జీలకర్ర ,ఆవాలు,ఎండుమిర్చి,మినపప్పు వేసి వేపుకోవాలి.
4.ఇప్పుడు అందులోకి ఉల్లిపాయలు వేసి మగ్గించుకోవాలి.
5.వేగిన ఉల్లిపాయల్లో కరివేపాకు వేసి ఉడకించిపెట్టుకున్న బంగాళదుంప తురుమును వేసి కలపుకోవాలి.
6.లో ఫ్లేమ్ పఐ రెండు మూడు నిమిషాలు ఉడికించి కొత్తిమీర చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆలు వేపుడు రెడీ.


