Allam Pachadi: ఇడ్లీ,దోశ,ఉప్మా ,పెసరట్టు టిఫిన్ ఏదైనా పర్ ఫెక్ట్ గా సూటయ్యే చట్నీ అల్లం చట్నీ.
ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
అల్లం – 3 టేబుల్ స్పూన్స్
పచ్చిమిర్చి – 7-8
మినపప్పు – 3 టేబుల్ స్పూన్
బెల్లం తురుము – 3 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
చింతపండు – 20 గ్రాములు
పసుపు – ¼ టీ స్పూన్
ఉప్పు – తగినంత
తయారీ విధానం
1.ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులోకి నూనే వేసి తరిగిన అల్లం,మినపప్పు,ఎండుమిర్చి,పచ్చిమిర్చి వేసి వేపుకోని చల్లరాఏ వరకు పక్కన పెట్టుకోవాలి.
3.మిక్సి జార్ లోకి వేపుకున్న పదార్ధాలను వేసుకోని అందులోకి బెల్లం,జీలకర్ర,నానబెట్టుకున్న చింతపండు,ఉప్పు,పసుపు వేసి కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
4.అంతే అల్లం చట్నీ రెడీ.


