Nail Bitting: గోళ్ళు కోరికే అలవాటు మానలేకపోతున్నారా? ఈ చిట్కాలు ట్రై చెయ్యండి!!

Nail Bitting: కొందరు అదేపనిగా గోళ్ళను కొరుకుతూ ఉంటారు. గోరు మొత్తం అరిగి,వేలు చివరి బాగం ముందుకు వచ్చినా సరే గోరును కొరకటం ఆపరు. ఈ అలవాటు దీర్ఘ కాలం పాటు కొనసాగితే
వేలు చుట్టూ ఉండే చర్మం పుండు పడటమే కాకా గోరు పెరగటానికి సహాయపడే కణజాలం
దెబ్బతింటుంది.

అంతేకాక ఇన్ ఫెక్షన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే గోళ్ళను కోరికే అలవాటు నుండి తప్పించుకోవచ్చు.

తరచూ గోళ్ళను కత్తిరిస్తూ ఉండాలి.

చేదుగా ఉండే నెయిల్ ఫాలిష్ వేసుకోవాలి. గోళ్ళు ఆకర్షనీయంగా కనపడటానికి మ్యనిక్యుర్ చేయించుకోవాలి. గోళ్ళు అందంగా కనపడితే గోళ్ళను కొరకాలని కోరిక ఉండదు.

ఒత్తిడి,ఆందోళన వంటివి కూడా గోళ్ళు కోరకటానికి కారణం అవుతాయి. కాబట్టి ఒత్తిడి లేకుండా ఉండటానికి యోగా చేయాలి.

ఇలాంటి పద్దతుల వలన ఎలాంటి ప్రయోజనం లేకపోతే చేతులకు గ్లవుజ్ లను వేసుకోవాలి. అలాగే వేళ్ళ చివర బ్యాండేజ్ అంటించాలి.

పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నా సరే గోర్లు కొరకటం మానకపోతే సైక్రియాటిస్టును సంప్రదించాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top