Neck Skin Tips : మిగతా శరీర బాగాలు ఎలా ఉన్న కొందరికి మెడ చుట్టూ నల్లగా ఉంటుంది. నగలువేసుకొనేటప్పుడు,లో నేక్ దుస్తులు వేసుకొనేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఇంటిలో మనకు సులభంగా అందుబాటులో ఉండేకొన్ని పదార్దాలతో చెక్ పెట్టవచ్చు.
బాదంలో లభించే విటమిన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. మెడ చుట్టూ నలుపును తగ్గించు కోవటానికి అరస్పూన్ బాదం పొడిలో ఒక స్పూన్ పాల పొడి,ఒక స్పూన్ తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో ఉంచి తీసి మెడకు రాసుకొని మర్దన చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
కలబంద చర్మానికి తేమను అందించటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. ప్రతి రోజు కలబంద గుజ్జును మెడకు ప్యాక్ వేసుకోవాలి. ఇరవై నిముషాలు మృదువుగామర్దన చేసి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
కీరదోస రసంలో కొంచెం రోజ్ వాటర్ కలిపి దానిలో కాటన్ బాల్ ని ముంచి మెడను శుభ్రం చేసుకోవాలి.ఒక వేళ రోజ్ వాటర్ అందుబాటులో లేకపోతే నిమ్మరసం కలుపుకోవచ్చు.
మూడు స్పూన్ల ఓట్స్ పొడిని తీసుకోని దానిలో కొద్దిగా టమోటా గుజ్జు కలిపి మెడకు పట్టించి మర్దన చేసుకొని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

