Sugar Side Effects: ఆహారం ద్వారా కానీ ఇతర పదార్దాల ద్వారా కానీ రోజుకి 6 స్పూన్ల కంటే ఎక్కువ
పంచదార తీసుకోవటం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోతాదుకు మించి
పంచదార తీసుకుంటే అధిక బరువుతో పాటు దంత సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే
అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
అయితే ఈ పరిశోదనలో ప్రతి రోజు తీసుకొనే పళ్ళు,పళ్ళ రసాలు,కూరగాయల ద్వారా లభించే చక్కెరను పరిగణలోకి తీసుకోలేదు. అయితే రోజుకి 25 గ్రాములు అంటే ఆరు స్పూన్లకి తక్కువ చక్కెర వాడే వారిలో ఆరోగ్య సమస్యలు దరి చేరవని అంటున్నారు.
చక్కెర ఎక్కువగా తీసుకోవటం వలన అధికంగా బరువు పెరగటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు. అంతేకాక పిల్లలు తీసుకొనే చక్కెర మీద కూడా ఓ కేన్నేసి ఉంచాలని అంటున్నారు.
సెంట్రల్ మరియు నార్త్ అమెరికాలో అత్యధికంగా అంటే రోజుకి 19 స్పూన్ల చక్కెరను తీసుకుంటారని ఒక సర్వేలో తెలిసింది. కాబట్టి పంచదారను మోతాదుకు మించి తీసుకోవటం కూడా మంచిది కాదని సరిపడా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.