Masala egg Curry: ఈ కర్రీ చిక్కని గ్రేవీతో, పుల్లగా కారంగా అన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ కర్రీ అన్నం, చపాతీ, పూరి,అట్టు ఇలా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది.
కావలసిన పదార్ధాలు
పులుసు కోసం
5 ఉడికించిన గుడ్లు
1/3 cup నూనె
1/2 liter నీళ్ళు
2 tbsps కొత్తిమీర తరుగు
గ్రేవీ కోసం
1/4 cup వేరుసెనగపప్పు
1/4 cup నువ్వులు
1/4 cup ఎండు కొబ్బరి పొడి
2 tbsp ధనియాలు
1 tsp జీలకర్ర
1/4 tsp మెంతులు
2 పెద్దవి ఉల్లిపాయ తరుగు (150 gms)
1 tbsp అల్లం వెల్లుల్లి పేస్ట్
1/4 tsp పసుపు
1 tbsp కారం
ఉప్పు
200 ml చింతపండు పులుసు
1/2 liter నీళ్ళు
తయారి విధానం
పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి మూకుడులో వేరుసేనగపప్పు , మెంతులు వేసి ఎర్రగా లో- ఫ్లేం మీద వేగించాలి. వేరు శెనగపప్పు బాగా వేగాక ధనియాలు, జీలకర్ర, వేసి ఒక నిమిషం వేగించాలి. ఆ తరువాత నువ్వులు వేసి వేగించాలి. ఆ తర్వాత కొబ్బరి పొడి వేసి 30 సెకన్లు వేపి మెత్తని పొడిగా చేసుకోవాలి.
అదే మూకుడులో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ చీలికలు వేసి ఎర్రగా వేగించాలి. వేగిన ఉల్లిపాయల్ని మెత్తగా చేసుకున్న పొడిలో వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో పొడితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, చింతపండు పులుసు, పసుపు అన్నీ వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.
Eggs ఉడికించి పై తొక్క తీసి గుడ్లకి గాట్లు పెట్టి గరిట బోర్లించి తిప్పుతూ హై ఫ్లేం మీద ఎర్రగా వేగించాలి. గుడ్లు వేగాక పక్కకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్టు వేసి నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి.
నూనె పైకి తేలాక అర లీటర్ నీళ్ళు పోసి హై- ఫ్లేం మీద మూత పెట్టి బాగా ఉడికించాలి.
గ్రేవీ ఉడికాక గుడ్లు వేసి మంట తగ్గించి మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి, మధ్య మధ్య లో అడుగు నుండి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి బాగా కలపి పొయ్యి మీద నుంచి దించాలి.


