Mango Ginger Rasam:భోజనంలో ఎన్ని రకాల కూరలు ఉన్నా ముఖ్యంగా మన తెలుగు వారికీ నాలుగు మధ్యలో తినాలంటే చారు ఉండాల్సిందే. అందుకే మనకి ఎన్నో రకాల చారులు అందుబాటులో ఉన్నాయి. మనం సాధారణంగా అల్లం చారు చేసుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు మామిడి అల్లం చారు ఎలా చేసుకోవాలో చూద్దాం.
కావలసిన పదార్ధాలు
అల్లం పేస్ట్ కోసం
35 - 40 gms మామిడి అల్లం ముక్కలు
6 - 7 ఎండుమిర్చి
1 tsp జీలకర్ర
2 tsp ధనియాలు
1 tsp మిరియాలు
ఛారు కోసం
50 gm చింతపండు
3 పండిన టొమాటో
ఒక కట్ట కొత్తిమీర
రాళ్ళ ఉప్పు
1.5 liter నీళ్ళు
2 పచ్చిమిర్చి చీలికలు
1/4 tsp పసుపు
2 tsp బెల్లం
2 tbsp కొత్తిమీర కాడలు
తాలింపు కోసం
2 tbsp నెయ్యి
1 tsp ఆవాలు
1/2 tsp జీలకర్ర
2 ఎండు మిర్చి
2 రెబ్బలు కరివేపాకు
3 tbsps పచ్చి కొబ్బరి
ఇంగువ – చిటికెడు
5 దంచిన వెల్లులి
తయారి విధానం
మిక్సీ జార్ లో 35 - 40 gms మామిడి అల్లం ముక్కలు, 6 - 7 ఎండుమిర్చి, 1 tsp జీలకర్ర, 2 tsp ధనియాలు, 1 tsp మిరియాలు వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఆ తర్వాత చింతపండులో కొంచెం నీళ్ళు పోసి పులసు తీయండి, అందులోనే టొమాటోలు, కొత్తిమీర కాడలు వేసి గట్టిగా పిండుతూ రసాన్ని తీసి పిప్పి పాడేయాలి.
ఈ రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోని దానిలో ఉప్పు, పచ్చిమిర్చీ, అల్లం పేస్ట్, నీళ్ళు అన్నీ పోసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి 15-20 నిమిషాలు మరగనివ్వాలి. బాగా పొంగుతున్నప్పుడు బెల్లం, కొత్తిమీర వేసి కలపాలి.
తాలింపు కోసం పొయ్యి మీద పాన్ పెట్టి 2 tbsp నెయ్యి, 1 tsp ఆవాలు, 1/2 tsp జీలకర్ర, 2 ఎండు మిర్చి, 2 రెబ్బలు కరివేపాకు, 3 tbsps పచ్చి కొబ్బరి, ఇంగువ – చిటికెడు, 5 దంచిన వెల్లులి వేసి వేగించి రసంలో కలపాలి. ఈ రసం అన్నంలోకి బాగుంటుంది.


