Alubukhara Fruit : ఆల్ బుకరా పండ్లు ఈ సీజన్ లో చాలా విరివిగా లభ్యం అవుతాయి. వీటిని వారంలో మూడు సార్లు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ఈ పండులో పైబర్, విటమిన్ ఎ మరియు సి ,పొటాషియం, మెగ్నీషియం మరియు ఐరన్ కంటెంట్ ఉన్నాయి. విటమిన్ D , B6, B12 మరియు కాల్షియం కూడా సమృద్దిగా ఉంటాయి.
ఈ పండ్లలో ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వాలన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ కారణంగా సెల్ డ్యామేజ్‌ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో కూడా సహాయపడుతుంది. లుటీన్ మరియు ఇతర పాలీఫెనోలిక్ సమ్మేళనాలు కణాలపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ఆల్ బుకరా పండ్లలో డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉంటుంది. అంతేకాక సార్బిటాల్ మరియు ఇసాటిన్ అనే సమ్మేళనాలు ప్రేగు కదలికలను నిర్వహించటానికి సహాయపడతాయి. సార్బిటాల్ అనేది ఒక సహజమైన భేదిమందుగా పనిచేస్తుంది.
ఇది పెద్ద ప్రేగులలో నీటిని గ్రహించి ప్రేగు కదలికను ప్రేరేపించి, తద్వారా మలబద్ధకం నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. ఇసాటిన్ జీర్ణవ్యవస్థ పనితీరును నియంత్రించడంలో సహాయపడుతుంది.
కంటికి సంబందించిన సమస్యలు లేకుండా చేస్తుంది. విటమిన్ కె,ఫినాలిక్ మరియు ఫ్లేవనాయిడ్స్ సమ్మేళనాలు సమృద్దిగా ఉండుట వలన మెనోపాజ్‌లో వచ్చే ఎముకల నష్టాన్ని తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్న వారు కూడా ఈ పండును తినవచ్చు.
ఆలూ బుఖారాలో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు మనం భోజనం చేసిన తర్వాత రక్తంలోకి గ్లూకోజ్ విడుదలను నియంత్రిస్తాయి మరియు ఇన్సులిన్ స్పైక్‌ను నియంత్రిస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.