
Kaju Pulao:ఎప్పుడైనా స్పెషల్ గా ఏదైనా తినాలని అనిపించినప్పుడు చిటికెలో తయారయ్యే కాజు పలావ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. kaju pulao కి కావలసిన పదార్ధాలు ,తయారీ విధానం తెలుసుకుందాం.
కావలసిన పదార్ధాలు
1 cup బాస్మతి బియ్యం (గంట నానబెట్టినది)
2 tbsps నెయ్యి2 tbsps నూనె
5 లవంగాలు
5 యాలకలు
1 ఇంచ్ దాల్చిన చెక్క
1 tbsp షాహీ జీరా
1 బిర్యానీ ఆకు
1 ఉల్లిపాయ చీలికలు
2 పచ్చిమిర్చి చీలికలు
75 gms జీడిపప్పు
1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
2 tsp పుదీనా తరుగు
2 tbsp కొత్తిమీర తరుగు
ఉప్పు
2 చిటికెళ్ల పసుపు
1 tbsp ఎండిన గులాబీ రేకులు లేదా / ½ tsp రోస్ వాటర్
తయారి విధానం
ముందుగా కుక్కర్ లో నెయ్యి ,నూనె వేసి వేడి చేసి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా వేసి వేగించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
ఆ తర్వాత జీడిపప్పు వేసి వేగించాలి. జీడిపప్పు ఎరుపు రంగులో వేగితే రుచి చాలా బాగుంటుంది. జీడిపప్పు సగం పైన వేగి రంగు మారుతూ ఉండగా పచ్చిమిర్చి చీలికలు. కొత్తిమీర,బిరియాని ఆకు, పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగించి పసుపు, ఉప్పు వేసి కలపాలి.
ఆ తర్వాత కప్పు నీళ్లు పోసి నానబెట్టిన బాస్మతి బియ్యం వెయ్యాలి. దీనిలో ఒక స్పూన్ గులాబీ రేకులు వేయాలి. గులాబీ రేకులు లేకపోతే పులావ్ దింపే ముందు అర స్పూన్ రోజు వాటర్ వేసుకోవాలి.
ఆ తర్వాత ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ రావాలి. ఆ తర్వాత సిమ్ లో పెట్టి 15 నిమిషాలు అలా వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత అడుగు నుండి అట్లకాడతో కలిపి సర్వ్ చేసుకోవాలి.

