Fatigue:ఎందుకో త్వరగా అలసిపోతున్నాం. ఏ పని చేయబుద్ది కావటం లేదు' ఇంటిలో ఉండే మహిళల దగ్గర నుండి ఉద్యోగినుల వరకు చాలా మంది నోట తరచూ వినపడుతున్న మాట. అలసిపోవటం అన్నది మాములే అని తేలికగా తీసుకోవటం వీలు లేదని నిపుణులు అంటున్నారు.
త్వరగా అలసిపోవటానికి చాలా కారణాలు ఉండవచ్చు. వాటిని పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే చాలా నష్టపోవలసి వస్తుందని నిపుణులు చెప్పుతున్నారు. త్వరగా ఎందుకు అలసిపోతారో కారణాలను తెలుసుకుందాము.
చాలా వరకు ఆరోగ్య సమస్యల కారణంగా త్వరగా అలసిపోవటం జరుగుతుంది. బలహీనం,కొన్ని రకాల గుండె జబ్బులు,హైపర్ ధైరాయిడ్ వలన కూడా త్వరగా అలసిపోవటం జరుగుతుంది.
తరచూ తలనొప్పి రావటం,చూపు మందగించటం వంటివి కూడా త్వరగా అలసిపోవటానికి కారణం కావచ్చు. ఇవి కనిపించిన వెంటనే డాక్టర్ ని సంప్రదించటం మంచిది.
పని ప్రదేశాలలో ఒత్తిడి,ఆందోళన వలన కూడా అలసట త్వరగా రావచ్చు.
నిద్రలేమి వలన కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. రోజు మొత్తం మీద ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. ఇంత కన్నా తక్కువ నిద్ర పొతే నీరసం,నిస్సత్తువ,అలసట వంటి సమస్యలు వస్తాయి.
పోషకాహార లోపం,శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాలు నిద్రలేమి మరియు అలసటకు కారణం అవుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


