Garlic Butter Naan : రెస్టారెంట్ల‌లో ల‌భించే విధంగా.. గార్లిక్ బ‌ట‌ర్ నాన్‌ల‌ను ఇలా త‌యారు చేసుకోండి..!

Garlic Butter Naan : రెస్టారెంట్ల‌లో ల‌భించే విధంగా.. గార్లిక్ బ‌ట‌ర్ నాన్‌ల‌ను ఇలా త‌యారు చేసుకోండి..!

కావలసిన పదార్దాలు
గోధుమపిండి: అరకిలో
పాలు: ఒక కప్పు
కోడిగుడ్లు: 2
పెరుగు: పావుకప్పు
నీళ్లు: సరిపడా
వెల్లుల్లితురుము: 4 టేబుల్‌స్పూన్లు
ఉప్పు: సరిపడా
నూనె: తగినంత
ఈస్ట్‌: టేబుల్‌స్పూను

తయారుచేసే విధానం
ముందుగా ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు పోసి దానిలో ఈస్ట్‌ వేసి 10 నిముషాలు ఉంచితే కరుగుతుంది. ఇప్పుడు దానిలో గోధుమపిండి,కోడిగుడ్లు, పెరుగు,పాలు,ఉప్పు వేసి మెత్తని పిండిలా బాగా కలిపి 10 నిముషాలు మర్దన చేయాలి. 

ఈ పిండిని నూనె రాసిన గిన్నెలో ఉంచి తడిబట్ట కప్పాలి. దానిని ఒక గంట పక్కన పెట్టాలి. అప్పుడు ఆ పిండి రెండింతలు అవుతుంది.

దీనిని నిమ్మకాయంత సైజ్ లో ఉండలు చేసుకొని వెల్లుల్లి తురుములో దొర్లించి నాన్ షేప్ లో చేసుకోవాలి. వీటిని నూనె లేదా వెన్నతో కాల్చుకోవచ్చు. లేనిచో నాన్ కాల్చిన తర్వాత వెన్న రాసిన బాగుంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top