Hibiscus For Hair Growth : ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించుకోవటానికి ఇంటిలో ఉన్న వస్తువులను ఉపయోగిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా సమస్య నుండి బయట పడవచ్చు.
మందార పువ్వు ఆకులతో ఇంట్లోనే హెయిర్ మాస్క్ తయారు చేసుకోండి, జుట్టు ఒత్తుగా, నల్లగా మారుతుంది, కేవలం రూ.20... ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ రకరకాల జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
జుట్టు సమస్యలను తగ్గించుకోవటానికి మనం అనేక రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తాము. ఈ ఉత్పత్తులు చాలా వరకు జుట్టు సమస్యలను నయం చేస్తాయి. అయితే ఈ ఉత్పత్తులలో ఉండే అనేక రకాల రంగులు, రసాయనాలు అనేక రకాల జుట్టు సమస్యలకు కారణమవుతాయి.
ఈ ఉత్పత్తులను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు అందం పాడవుతుంది. అందువల్ల ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సులభంగా తగ్గించుకోవచ్చు.
1. మందార పూలు - 3 నుండి 4 పువ్వులు
2. మందార ఆకులు - 8 నుండి 10 ఆకులు
3. కరివేపాకు - 1 కప్పు
4. పెరుగు - 1 కప్పు
5. అలోవెరా - 2 టేబుల్ స్పూన్లు
పెద్ద మిక్సర్ గిన్నెలో మందార పువ్వులు, మందార ఆకులు, కరివేపాకు , పెరుగు, కలబంద వేసి మిక్సీ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి అరగంట తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. ప్రతి 15 రోజులకోసారి ఈ హెయిర్ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల చాలా జుట్టు సమస్యలు నయమవుతాయి.