బీరకాయలతో కూర, పప్పు, పచ్చడి ఇలా రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటుంటాం
బీరకాయలో ఫైబర్, విటమిన్ సి, జింక్, మెగ్నీషియం, ఐరన్, థియామిన్ , రిబోఫ్లేవిన్, బీటా కెరోటిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
బీరకాయలో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండుట వలన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
తాజా బీరకాయలో సెల్యులోజ్ , నీటి శాతం అధికంగా ఉండుట వలన ప్రేగులలో పేరుకుపోయిన మలాన్ని తేలికపరిచి మలవిసర్జన సాఫీగా జరగడానికి సహాయపడి మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది.
బీరకాయలను తింటే కడుపు నిండిన భావన కలిగి తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటాం. దాంతో బరువు తగ్గుతారు.
బీరకాయలలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన రక్తాన్ని శుద్ధి చేసి మొటిమలు, మచ్చలను తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచుతాయి
కామెర్లను తగ్గించే సామర్థ్యాన్ని బీరకాయలు కలిగి ఉంటాయి
రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ ను స్థిరంగా ఉంచి డయాబెటిస్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.
ఇది ఇన్ఫెక్షన్ , వైరస్ వంటి వాటి నుంచి శరీరాన్ని కాపాడే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కడుపు నొప్పి, కడుపులో మంట, వికారం వంటి ఉదర సంబంధిత సమస్యలను తగ్గించడంతోపాటు ఫైల్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.