Meal maker manchurian:మీల్మేకర్ తో మంచురియా సింపుల్ గా.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ...

Meal maker manchurian:మీల్మేకర్ తో మంచురియా సింపుల్ గా.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ...
సాయంత్రమైతే ఏం తినాలా అని ఆలోచిస్తున్నారా? ఒకసారి మీల్ మేకర్‌తో మంచూరియా చేసి చూడండి. రుచి అదిరిపోతుంది.

కావాల్సిన పదార్దాలు
మీల్‌ మేకర్‌ - 200 గ్రాములు,
ఉల్లిపాయలు - 100 గ్రాములు
క్యారెట్‌ - 100 గ్రాములు,
బఠాణీలు - 100 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 100 గ్రాములు,
కొత్తిమీర - 1 కట్ట
పచ్చిమిర్చి - 10,
కార్న్‌ఫ్లోర్‌ - 1 స్పూన్‌
అజినమోటో - 1 స్పూన్‌
సోయాసాస్‌ - 4 స్పూన్లు
వెనిగర్‌ - కొద్దిగా
ఉప్పు - తగినంత
మైదా - 2 స్పూన్లు

తయారీ విధానం
క్యారెట్‌, బఠాణీలను ఉడికించుకోవాలి. నీళ్లలో మీల్‌ మేకర్‌ వేసి పొయ్యి మీద పెట్టి పది నిమిషాలు ఉడికించాలి. ఈ మీల్‌ మేకర్‌ లో నీటిని తీసివేసి ఒక గిన్నెలో వేయాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ , పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన క్యారెట్‌, బఠాణీలు, మైదా, కార్న్‌ఫ్లోర్‌, సోయాసాస్‌, అజినమోటో, ఉప్పు, వెనిగర్‌ వేసి కలపాలి. 

ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కాగిన నూనెలో వేగించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడి చేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి వేగించాలి. అందులోనే వేయించిన మంచూరియా వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే..... నోరూరించే మీల్‌ మేకర్‌ మంచూరియా రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top