Hair Care Tips:కొన్ని మందిలో జుట్టు సరిగా పెరగదు, దీని వలన జుట్టు రాలిపోతుంది. కానీ కొత్త జుట్టు మొలవదు. దీని ఫలితంగా, జుట్టు పలుచగా మారిపోతుంది. పలుచని జుట్టు సమస్యతో ఇబ్బంది పడే వారు చాలా మంది ఉన్నారు. అయితే, ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ టానిక్ వారికి చాలా మేలు చేస్తుంది.
వారంలో ఒకసారి ఈ టానిక్‌ను వాడితే, రెండు నెలల్లో మీ జుట్టు గట్టిపడుతుంది. ఇప్పుడు ఆ హెయిర్ టానిక్‌ను ఎలా తయారు చేయాలో చూద్దాం.
మొదటగా, స్టవ్ ఆన్ చేసి, ఒక పాన్‌లో ఒక చిన్న గ్లాస్ నీరు పోసి నాలుగు బిర్యానీ ఆకులను వేసి పది నిమిషాలు మరగబెట్టి నీరు వడపోసుకోవాలి. తర్వాత, మిక్సీ జార్‌లో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి రసం వేరు చేయాలి.
ఉల్లిపాయ మరియు అల్లం రసంలో బిర్యానీ ఆకులను వేసి మరిగించిన నీటితో మరియు ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌ను కలిపి బాగా కలిపితే మన హెయిర్ టానిక్ తయారవుతుంది. ఈ టానిక్‌ను తలపై మరియు జుట్టుకు పూర్తిగా పట్టించి కనీసం 10 నిమిషాలు బాగా మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత, తేలికపాటి షాంపూతో తలను శుభ్రంగా కడగాలి.
వారంలో ఒకసారి ఈ పద్ధతిని అనుసరించడం వలన తలపై రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు వృద్ధి బాగా పెరుగుతుంది. మీ జుట్టు త్వరలోనే గట్టిపడి, దట్టంగా మారుతుంది. మరియు జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
ఈ టానిక్ పొడవైన, బలమైన జుట్టుకు తోడ్పడుతుంది. టానిక్‌లో ఉండే యాంటీ మైక్రోబయల్ మరియు యాంటిసెప్టిక్ గుణాలు శిరోజాలను శుభ్రపరచి, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడతాయి. చుండ్రు సమస్యను కూడా నివారిస్తాయి.