Bendakaya Pakodi:ఫంక్షన్ స్టైల్ క్రిస్పీ బెండకాయ వేపుడు సింపుల్ గా ఇంట్లోనే చెయ్యండి.. ఒకసారి తింటే మరల మరల తినాలని అనిపిస్తుంది.
కావలసిన పదార్దాలు
బెండ కాయలు - పావుకిలో
శనగపిండి - కప్పు
బియ్యప్పిండి - పావు కప్పు
ఉప్పు, కారం - తగినంత
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్
నూనె - వేయించడానికి తగినంత
తయారి విధానం
బెండకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. బెండకాయ ముక్కలలో బియ్యపిండి, శనగపిండి, ఉప్పు,కారం వేసి బాగా కలపాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపాలి. దీనిలో కొంచెం నీళ్ళు చల్లి పిండి ముక్కలకు బాగా పట్టేలా కలపాలి.
పొయ్యి వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి కాగాక ఈ పిండిని పకోడీ మాదిరిగా వేసి గోల్డ్ కలర్ వచ్చే వేగించాలి. అంతే బెండకాయ పకోడీ రెడీ. ఇది స్నాక్స్ గా తినటానికి చాలా బాగుంటుంది.