Health Tips : ఈ మసాలా దినుసులు వాడితే చాలు.. మనం నిత్యం వాడే సుగంధ ద్రవ్యాలలో మన ఆరోగ్యానికి పనికివచ్చే ఎన్నో సుగుణాలు ఉన్నాయి. అందువల్ల మనం వాటిని క్రమం తప్పకుండా మన ఆహారంలో తీసుకుంటే మంచిది. అయితే ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
యాలకులు
తీపి పదార్దాలకు మంచి వాసన మరియు రుచి కోసం వీటిని వాడుతూ ఉంటారు. ఇవి కేలరీలను సులభంగా కరిగిస్తాయి. జీవక్రియ పనితీరు సరిగ్గా ఉండేలా చేస్తాయి. కొద్దిగా వాడిన సరే, కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. కాబట్టి యాలకుల పొడిని టీలో కలుపుకొని త్రాగితే మంచిది.
జీలకర్ర
ఇది ఏకాగ్రతను పెంచుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించటం, రక్తపోటును, గుండె కొట్టుకొనే వేగాన్ని సమతూకంలో ఉంచటం, ఉబ్బసం, రక్తహినత, జలుబు వంటి వాటిని తగ్గించటంలో కీలకంగా పనిచేస్తుంది. అంతేకాక లైంగిక ఆరోగ్యాన్ని అందించటంలో జీలకర్ర బాగా పనిచేస్తుంది. దీనిని పొడి రూపంలో గాని, నేరుగా ఆహారంలో తీసుకోవచ్చు.
పసుపు
మాంసకృత్తులు,పీచు నియాసిన్, విటమిన్ ఇ, సి, కె లు, సోడియం, పొటాషియం,రాగి, ఇనుము, మెగ్నీషియం వంటి పోషకాలు పసుపులో సమృద్దిగా ఉన్నాయి. అంతేకాక పసుపులో యాంటి ఫంగల్, యాంటి వైరల్, యాంటి బ్యాక్టిరియాల్, యాంటి ఇన్ ఫ్లమెటరి లక్షణాలు ఉంటాయి.