Crispy banana:కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ బనానా.. అరటి కాయతో ఇలా చేస్తే పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు.
కావలసిన పదార్దాలు
అరటికాయ - ఒకటి
శనగపిండి - టీ స్పూను
మైదా - టీ స్పూను
కార్న్‌ఫ్లోర్ - టీ స్పూను
ఉప్పు - తగినంత
అల్లంవెల్లుల్లి ముద్ద - అర టీ స్పూను
ఉల్లితరుగు - అర కప్పు
కరివేపాకు - రెండు రెమ్మలు
జీలకర్ర - టీ స్పూను,
కారం - టీ స్పూను,
ఎండుమిర్చి - 4,
జీడిపప్పుపొడి - టీ స్పూను,
పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు,
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా,
మిరియాలపొడి - అర టీ స్పూను,
ధనియాలపొడి - అర టీ స్పూను,
కొత్తిమీర - ఒక కట్ట
తయారు చేసే విధానం
ముందుగా అరటికాయను చెక్కు తీసి చిన్నచిన్న ముక్కలుగా కోసి నీటిలో వేయాలి. పొయ్యి వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి వేడెక్కాక అరటికాయ ముక్కలను వేసి వేగించాలి. ఇంకో బాణలిలో కొంచెం నూనె పోసి కాగాక ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డ్ కలర్ వచ్చేవరకు వేగించాలి.
ఇప్పుడు ఇందులో అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు,జీలకర్ర వేసి వేగించాలి. కొంచెం వేగాక జీడిపప్పు పొడి,కారం, ఉప్పు వేసి బాగా కలిపి,అందులో పైన వేగించి ఉంచుకున్న అరటికాయ ముక్కలను వేసి బాగా కలిసేలా కలపాలి.
ఒక గిన్నెలో మైదా, శనగపిండి, కార్న్‌ఫ్లోర్, కొద్దిగా నీటిని పోసి జారుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముక్కల మీద పోసి బాగా కలపాలి. ముక్కలు దగ్గర పడిన తరవాత మిరియాలపొడి, ధనియాలపొడి వేసి బాగా కలిపి ఒక బౌల్ లోకి తీసుకోని కొత్తిమీర తో గార్నిష్ చేయాలి.