Kashmiri Palak kofta curry:పాలకూర తో ఇలా పాలక్ కోఫ్తా కర్రీ చేసుకోండి సూపర్ గా ఉంటుంది..
కావలసిన పదార్దాలు
పాలకూర - 100 గ్రా.,
ఉప్పు - తగినంత,
నూనె - డీప్ ఫ్రైకి సరిపడినంత,
జీలకర్ర - అర టీ స్పూను,
మైదా - రెండు టేబుల్ స్పూన్లు,
జీడిపప్పు - 50 గ్రా.
నీరు - తగినంత,
ఏలకుల పొడి - అర టీస్పూను,
స్వీట్ క్రీమ్ - 2 టీ స్పూన్లు,
ధనియాలపొడి - టీ స్పూను,
కసూరీ మేథీ - టీ స్పూను
తయారీ విధానం
పాలకూరను శుభ్రంగా కడిగి మెత్తగా ఉడికించాలి. ఇది చల్లారిన తర్వాత ఉప్పు వేసి మెత్తని పేస్ట్ చేయాలి. పొయ్యి మీద బాణలి పెట్టి ఒక స్పూన్ నూనె వేసి కాగాక, దానిలో జీలకర్ర వేసి కొంచెం వేగాక మైదా వేసి పచ్చివాసన పోయేవరకు వేగించాలి.
ఈ మిశ్రమాన్ని పాలకూర పేస్ట్‌లో వేసి కోఫ్తా(బాల్స్ మాదిరిగా)లా తయారు చేయాలి. మరల వేరే బాణలి పొయ్యి మీద పెట్టి నూనె పోసి కాగాక ఈ కోఫ్తాలను డీప్ ఫ్రై చేయాలి. జీడిపప్పులో తగినంత నీరు పోసి పేస్ట్ (మరీ పల్చగా ఉండకూడదు) చేయాలి.
ఒక పాన్‌లో ఈ పేస్ట్ వేసి కొంచెం ఉడికిన తరవాత ఏలకులపొడి, ధనియాలపొడి, కసూరీ మేథీ, స్వీట్ క్రీమ్ వేసి రెండు నిముషాలు ఉడికిస్తే గ్రేవీ తయారవుతుంది. ఈ గ్రేవీ లో పైనతయారు చేసుకున్న పాలక్ కోఫ్తాలు వేసి ఐదునిముషాలు ఉడికిస్తే పాలక్ కాశ్మీర్ కోఫ్తా రెడీ.