How to lighten dark elbows:మీ మోచేతులు నల్లగా మారాయా? - ఈ టిప్స్‌తో అందంగా మెరిసి పోవడం ఖాయం..చాలా మందికి శరీరం అంతా మృదువుగా ఉంటుంది. కానీమోచేతులు,మోకాళ్ళు మాత్రం నల్లగా,గరుకుగా ఉంటాయి. అవి మృదువుగా మారాలంటే కొన్ని జాగ్రత్తలుతీసుకోవాలి.
కేవలం ముఖానికి నలుగు పెడితే సరిపోదు. మృత కణాలు ఎక్కువగా ఉండే మోచేతులు,మోకాళ్ళ దగ్గర కూడా నలుగు పెట్టుకోవాలి. దాని కోసం నలుగును ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు.
ఒక స్పూన్ తేనెలో కాస్త పంచదార కలిపి, ఈ మిశ్రమంతో మోచేతులు,మోకాళ్ళ దగ్గర బాగా రుద్దాలి. కొంతసేపు అయిన తర్వాత నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే మురికి పోయి మృదువుగా మారుతుంది.
బంగాళదుంప, నిమ్మ రెండింటిలోను బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి. వీటిని ముక్కలుగా కోసి మోకాలు,మోచేతి ప్రాంతంలో రుద్దితే నల్లదనం పోతుంది. ఆ ముక్కలపై తేనే వేసి రుద్దినా మంచి పలితం కనపడుతుంది.
బాదం నూనె లేదా కొబ్బరి నూనెను ఆ ప్రాంతంలో రాసి మర్దన చేస్తే, రక్త ప్రసరణ బాగా పెరిగి చర్మం తాజాగా కనపడు తుంది. మాయీశ్చరైజర్ ను ముఖానికే కాకుండా మోకాలు,మోచేతులకు కూడా రాయాలి.