Aratikaya 65 recipe:అరటికాయ 65 ఇలా చేసి చూడండి రుచి అదిరిపోతుంది.. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అరటికాయతో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది.
కావలసిన పదార్దాలు
అరటికాయ - ఒకటి,
మైదా - టీ స్పూను,
కార్న్‌ఫ్లోర్ - టీ స్పూను
శనగపిండి - టీ స్పూను,
ఉప్పు - తగినంత,
కారం - అర టీ స్పూను
పసుపు - అర టీ స్పూను,
పచ్చిమిర్చితరుగు - 4,
ఉల్లితరుగు - అర కప్పు
కరివేపాకు - నాలుగు రెమ్మలు,
అల్లంవెల్లుల్లి ముద్ద - అర టీ స్పూను
నూనె - పావు కిలో,
పెరుగు - అర కప్పు,
నీరు - తగినంత
తయారి విధానం
ముందుగా అరటికాయను చెక్కు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. (కోసిన ఈ ముక్కలను మజ్జిగ కలిపిన నీటిలో వేస్తే నల్లబడకుండా ఉంటాయి). ఒక బౌల్ తీసుకోని దానిలో కార్న్‌ఫ్లోర్, శనగపిండి, మైదా,పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.
దీనిలో ముందుగా కోసి ఉంచుకున్న అరటికాయ ముక్కలను కలపాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాణలి పెట్టి దానిలో నూనె పోసి కాగాక, పైన తయారుచేసుకున్న మిశ్రమాన్ని పకోడీ మాదిరిగా వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి.
మరొక బాణలి పొయ్యి మీద పెట్టి నాలుగు స్పూన్ల నూనె వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు , అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముక్కల, కరివేపాకు వేసి వేగించాలి. ఇది బాగా వేగాక ఒక కప్పు పెరుగు, తగినంత నీరు పోయాలి. నీరు బాగా దగ్గరపడిన తరవాత అందులో పైన తయారు చేసుకున్న పకోడి లను వేసి కలిపి 5 నిముషాలు అయ్యాక దింపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.