Coconut Oil Health Benefits : జుట్టుతోపాటు చర్మానికి కూడా కొబ్బరినూనె రాస్తున్నారా.. సహజ సిద్దమైన కొబ్బరి నూనె చర్మానికి,జుట్టుకు చాలా మేలు చేస్తుంది. అది ఒక మంచిమాయీశ్చరైజర్ గా పనిచేస్తుంది. అలాగే మేకప్ రిమూవర్ గా కూడా పనిచేస్తుంది.
ప్రతి రోజు కొబ్బరి నూనెను శరీరానికి రాసుకొని మర్దన చేసుకుంటే మచ్చలు,గీతలు తగ్గుతాయి. స్నానానికి ముందు కొబ్బరి నునేను రాసుకొని మర్దన చేసుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి.
అంతేకాక ఒంటిలోని తేమ బయటకు పోకుండా ఉంటుంది.
గోరు వెచ్చని కొబ్బరి నూనెను తలకు రాసుకొని మర్దన చేసుకుంటే జుట్టు మృదువుగా,కాంతివంతముగా మారుతుంది. జుట్టు నుంచి ప్రోటిన్స్ బయటకు పోవటం తగ్గుతుంది.
జుట్టుకు మంచి కండిషనర్ గా ఉపయోగపడుతుంది. కాలిన గాయాలు,ఎండ వేడికి కమిలిన చర్మం పై కొబ్బరి నూనెను రాస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది. కనురెప్పలకు రాసే మస్కారా, కాటుక వంటి మేకప్ ను తొలగించటానికి కొబ్బరి నూనెలో ముంచిన దూదితో తుడిస్తే సులువుగా పోతాయి.