Malai Kofta Curry :మలై కోఫ్తా కర్రీ .. చపాతీ,రైస్ లోకి సూపర్ గా ఉంటుంది.. ఒకసారి తింటే అసలు వదిలిపెట్టరు..
కావలసిన పదార్దాలు
పెరుగు మీద మీగడ : 100 గ్రా.
క్యారెట్ : 100 గ్రా.
ఆనపకాయ : 200 గ్రా.
బంగాళాదుంపలు : 100 గ్రా.
శనగపిండి : 50 గ్రా.
పచ్చిమిరపకాయలు : 20 గ్రా.
కొత్తిమీర : రెండు కట్టలు
నిమ్మకాయ : సగం చెక్క
రిఫైన్డ్ ఆయిల్ : వేయించడానికి సరిపడా
ఉప్పు : తగినంత
గ్రేవీ కోసం...
జీడిపప్పు : 25 గ్రా.
గసగసాలు : 25 గ్రా.
కారంపొడి : ఒక టీ స్పూన్
పెరుగు : 1/2 టీ స్పూను
క్రీమ్ : 50 మి.లీ.
అల్లం వెల్లుల్లి : ఒక టీస్పూన్
ఉల్లిపాయలు : 100 గ్రా.
గరం మసాలా : చిటెకెడు
తయారీ విధానం
ఆనపకాయ, క్యారెట్ లను చెక్కు తీసి తురమాలి. తురిమిన ఆనపకాయ నుంచి నీటిని పూర్తిగా పిండాలి. అలాగే ఉడక బెట్టిన బంగాళాదుంపలను కూడా తురమాలి.ఇప్పుడు పొయ్యి వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి కాగాక దానిలో పచ్చి మిరపకాయలు వేగించి, అందులో శనగపిండి కూడా వేసి దోరగా వేగించి, ఆ తర్వాతతురిమి ఉంచుకున్న క్యారెట్, ఆనపకాయలను వేసి బాగా కలిపి పొయ్యి మీద నుంచి కిందకు దింపాలి.
ఇప్పుడు దానిలో తురిమిన బంగాళా దుంప, పెరుగుమీగడ, కొత్తిమీర, నిమ్మ రసం వేసి బాగా కలిపి పిరమిడ్లలాంటి కోఫ్తాలుగా తయారుచేయాలి. ఆ తర్వాత వీటిని కార్న్‌ఫ్లోర్‌లో దొర్లించి, కాగిన నూనెలో గోల్డ్ కలర్ వచ్చేవరకు వేగించాలి. వీటిని ఒక బౌల్ లోకి తీసుకోని, వాటి మీద ముందుగా తయారుచేసుకున్న గ్రేవిని పోసి, కొత్తిమీర, క్రీం తో గార్నిష్ చేయాలి.
గ్రేవీ తయారీ
జీడిపప్పు, గసగసాలను మెత్తగా మిక్సీ చేయాలి. పొయ్యి వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి కాగాక సన్నగా తరిగిన ఉల్లి పాయల ముక్కలను వేసి కొంచెం వేగాక, అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి నూనె తేలేవరకూ వేగించాలి. అందులో గరం మసాలా, పెరుగు, తగినంత నీరు పోసి మరగనివ్వాలి.