Corn Kebabs:పిల్లలుస్నాక్స్ అడిగితే కార్న్ తో వేడివేడిగా ఇలా కబాబ్ చేసిపెట్టండి..మొక్కజొన్న కబాబ్ చేయటం చాలా సులభం. ఇంటిలో చేసుకుంటే చాలా బాగుంటాయి. ప్రస్తుతం కార్న్ చాలా విరివిగా లభిస్తున్నాయి.
కావాల్సిన పదార్దాలు
లేత మొక్కజొన్నగింజలు... 2 కప్పులు
పచ్చిమిర్చి... 6
ఉల్లిపాయ... ఒకటి
అల్లం... చిన్నముక్క
వడకట్టిన పెరుగు... అరకప్పు
గరంమసాలా... పావు టీ.
చాట్‌మసాలా... పావు టీ.
కొత్తిమీర... 2 కట్టలు
క్యాప్సికమ్... ఒకటి
నిమ్మరసం... నాలుగు టీ.
ఉప్పు... తగినంత
తయారీ విధానం
లేత మొక్కజొన్న గింజల్ని ఒలిచి మిక్సీలో కాస్త కచ్చాపచ్చాగా మిక్సీచేయాలి. క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వీటి అన్నింటిని చాలా సన్నగా తరగాలి. ఒక గిన్నెలో మిక్సీ చేసి పెట్టుకున్నా మొక్కజొన్న ముద్ద వేసి, దానిలో అల్లంముక్కలు, ఉప్పు, గరంమసాలా, చాట్‌మసాలా వేసి బాగా కలపాలి.
క్యాప్సికమ్, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వడకట్టిన పెరుగు వేసి కాస్త గట్టిగా కలపాలి. ఇప్పుడు వేలు మందంలో ఉండే ఇనుప చువ్వను తీసుకుని ఈ కబాబ్ మిశ్రమాన్ని దాని చుట్టూ అంటించి నిప్పులు లేదా గ్యాస్ స్టవ్ మీద ఎర్రగా కాల్చాలి. వీటిని వేడివేడిగా చట్నీతో సర్వ్ చేస్తే భలే రుచిగా ఉంటాయి.