Papad Curry: ఎవ్వరికైనా నచ్చే అప్పడాలతో కూర.. ఎప్పుడు చేసుకొనే కూరలా కాకుండా కాస్త వెరైటీగా అప్పదాలతో కూరను చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్ధాలు తయారి విధానం వివరంగా తెలుసుకుందాం.
కావాల్సిన పదార్దాలు
వేయించిన అప్పడాలు- పది
ఉల్లిపాయ- ఒకటి (తరగాలి)
టొమాటో - ఒకటి (తరగాలి)
తరిగిన కొత్తిమీర - రెండు టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు- పావు టీ స్పూన్
చక్కెర - చిటికెడు
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర - టీ స్పూన్
ఆవాలు - అర టీ స్పూన్
ఉప్పు - తగినంత
మిరప్పొడి - పావు టీ స్పూన్
తయారి విధానం
పొయ్యి వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక దానిలో జీలకర్ర,ఆవాలు వేయాలి. అవి వేగిన తర్వాత ఉల్లి పాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర వేసి అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లులి పేస్టు, చక్కెర, ఉప్పు, కారం వేసి మూడు నిముషాలు ఉడికించాలి. ఇప్పుడు అప్పడాలను నలిపి బాణలిలో వేసి కొంచెం నీరు పోసి సన్నని మంట మీద మూడు నిముషాలు ఉడికిస్తే పాపడ్ కర్రీ రెడీ.