Monsoon Diet :వర్షాకాలంలో ఇవి తిన్నారా.. రోగాలకు స్వాగతం పలికినట్లే.. ఓ పక్కన సన్నని జల్లులు ..... మనసేమో వేడివేడిగా ఎం తిందామా అని ఆలోచిస్తుంది . ఇన్ఫెక్షనలు త్వరగా వ్యాపించే ఈ కాలంలో జిహ్వకోరే రుచులనే కాదు ..... ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి !
వానలో తడుస్తూ ముందు వెళ్ళుతున్నప్పుడు రోడ్డు పక్కన పకోడీ బండి కనిపిస్తే ఆగి తినవద్దు. వాతావరణంలో తేమ ఎక్కువ ఉండే ఈ కాలంలో జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది . బాగా వేయించిన , నూనె ఎక్కువగా వాడిన పదార్దాలు త్వరగా పొట్టని పాడుచేస్తాయి .
అవి జీర్ణమవడం కష్టం . అదీకాక అక్కడ ఏ నూనె వాడతారో మనకు తెలియదు . అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని నాణ్యతకు ప్రాదాన్యం ఇస్తారన్న నమ్మకం కలిగినప్పుడు మాత్రమే తినవచ్చు. అదీ తరచుగా కాదు !!
ఇక చాట్ కన్పిస్తే చాలు .... 'ఒకే ఒక్క ప్లేట్' అని మనసు తినమని తొందర చేస్తుంది. చాట్ ,పానిపురిలలో వాడే పదార్దాలు నీటితో చేసినవి. ఎందుకంటే వర్షాకాలంలో వచ్చే చాలా అనారోగ్యాలకు నీరు కారణం అవుతుంది . దీన్ని గుర్తుంచుకొని తినాలో వద్దో మీరే నిర్ణయించుకోండి .
కృత్రిమ రంగులు,టెస్టింగ్ సాల్ట్, అజినమోతో వంటి వాటిని ఎక్కువగా ఉపయోగించే చైనీస్ ఆహారాలకు దూరంగా ఉండాలి. వానాకాలంలో ఆకుకూరలపై మట్టి ఎక్కువగా ఉంటుంది. వాటిని సరిగ్గా శుభ్రం చేయకుండా ఉపయోగిస్తే డయేరియకి దారి తీస్తుంది.