Beetroot Kurma: బీట్ రూట్ ను కొంత మంది నేరుగా సలాడ్స్ లో యాడ్ చేసుకుని తింటారు. అలా పచ్చిది తినలేని వారు కూరలు చేసుకుని తింటారు.
ఎక్కువ మంది బీట్ రూట్ తో కేవలం వేపుళ్లు మాత్రమే చేసుకుని తింటారు. కూరలు తక్కువగా చేసుకుని తింటారు. అలా కాకుండా ఒక్కసారి ఇలా బీట్ రూట్ తో కూర్మా చేసుకుని తింటే.. అస్సలు వదిలి పెట్టరు.
కావలసిన పదార్దాలు
బీట్‌రూట్ ముక్కలు - ఒక కప్పు
ఉల్లితరుగు - అర కప్పు;
పచ్చికొబ్బరి లేదా ఎండుకొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు;
పల్లీలు లేదా జీడిపప్పు - 2 టేబుల్‌స్పూన్లు;
వెల్లుల్లి రెమ్మలు - 4;
అల్లం - చిన్నముక్క;
జీలకర్ర - టీ స్పూను;
నూనె - టేబుల్ స్పూను;
ఉప్పు, కారం - తగినంత,
కొత్తిమీర - కొద్దిగా
తయారి విధానం
బీట్‌రూట్ ముక్కలను కుకర్‌లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. జీడిపప్పు,కొబ్బరి, వెల్లుల్లి, అల్లం, కొంచెం నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి కాగాక జీలకర్ర వేసి చిటపటలాడాక, సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేగించాలి.
తర్వాత గ్రైండ్ చేసిన మిశ్రమంను కూడా వేసి కొంచెం నీటిని పోసి కొంతసేపు ఉడికించాలి. ఆఖరుగా బీట్‌రూట్, ఉప్పు, కారం, కొత్తిమీర కూడా వేసి మూడునిముషాలు ఉడికించి దించాలి. ఇది చపాతీలలోకి, బిరియానీలోకి మంచి కాంబినేషన్.