Skin Care: పొడి చర్మం ఉన్నవారికి బ్యూటీ టిప్స్.. ఈ చిట్కాలతో మెరిసే చర్మం మీ సొంతం.. చర్మం తేమ కలిగి ఉంటేనే నిగనిగలాడుతూ ఉంటుంది. ప్రతిసారి చర్మానికి మాయీశ్చరైజర్ రాయకుండానే సహజంగా తేమ ఉండేలా చూసుకోవచ్చు.
పాల మీగడలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట అయిన తర్వాత
ముఖాన్ని మంచి నీళ్ళతో శుభ్రంగా కడగాలి.
ప్రతి రోజు స్నానం చేయటానికి పావుగంట ముందు ముఖానికి తేనే రాసుకోవాలి.ఎందుకంటే తేనెలో సూక్ష్మ క్రిములను చంపే గుణం ఉంటుంది. అంతేకాక యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా లభిస్తాయి. ఈ విధంగా తరచూ చేస్తూ ఉంటే ముఖం తేమగా మారుతుంది. అలాగే మచ్చలు కూడా తగ్గుతాయి.
ఒక కప్పు పెరుగులో మూడు స్పూన్ల బొప్పాయి గుజ్జు, కొన్ని చుక్కల తేనే,నిమ్మరసం కలపాలి. దీనిని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత మంచి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే మంచి పలితం కనపడుతుంది.
బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి, దానిలో రెండు స్పూన్ల పెరుగు,కొన్ని చుక్కల తేనే వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి, అరగంట అయ్యాక మంచి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి.