Radish benefits: ఈ లాభాలు తెలిస్తే.. శీతాకాలంలో ముల్లంగిని తినే చాన్స్ మిస్ చేసుకోరు.. ముల్లంగి అన్ని కాలాలలోనూ మార్కెట్ లో దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. దీనిని కూరల్లోనూ, సాంబార్ లోను,సలాడ్స్..... ఎలా తీసుకున్నా మాన శరీరానికి పోషకాలు అందుతాయి.
చాలా మంది మహిళల్లో కాలంతో సంబంధం లేకుండా తరచూ మూత్ర సంబంద సమస్యలువస్తూ ఉంటాయి. అలాంటి వారు ముల్లంగిని ఎక్కువగా తీసుకుంటే మంచిది. మూత్ర సమస్యలు, మంట,వాపు వంటి వాటిని ముల్లంగి అదుపు చేస్తుంది. మూత్రపిండాలలో ఇన్ ఫెక్షన్ ని దూరం చేస్తుంది.
బరువు తగ్గాలని అనుకునే వారికీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో పీచు ఎక్కువగా,కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా తక్కువ మొత్తంలో తీసుకున్నా కూడా కడుపు నిండిన భావన ఉంటుంది.
ముల్లంగిలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండుట వలన జీవక్రియ రేటును పెంచి తద్వారా మలబద్దకంను తగ్గిస్తుంది. ముల్లంగిలో ఫోలిక్ యాసిడ్,విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. అందువలన క్యాన్సర్ కి కారణం అయిన కారకాలతో పోరాటం చేస్తాయి. అలాగే కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.