Face glow with stream:ఇలా ఆవిరి పడితే.. మీ అందం రెట్టింపు అవుతుంది.. ముఖానికి సహజ కాంతిని అందించటంలో, మురికిని తొలగించటంలో ఆవిరి ముఖ్య పాత్రను పోషిస్తుంది. రోజు విడిచి రోజు ముఖానికి ఆవిరి పట్టటం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఉదయం ఆఫీస్ కి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మన ముఖం మీద ఎంతో మురికి చేరుతుంది.
దీనివలన చర్మ రంద్రాలు మూసుకొని పోయి మొటిమలు వచ్చే అవకాశం ఉంది. అటువంటి సమయంలో ముఖానికి ఆవిరి పడితే చర్మ రంద్రాలు తెరుచుకుంటాయి. ఆవిరి పట్టాక మెత్తని గుడ్డతో తుడవాలి. ఆ తర్వాత ముఖాన్ని ఫేస్ వాష్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయుట వలన మృత కణాలు తొలగిపోతాయి.
ఆవిరి పెట్టినప్పుడు ఆ వేడికి చర్మం ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని వలన రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. ఆవిరి పట్టటం వలన బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ తొందరగా తొలగిపోతాయి. వారంలో రెండు సార్లు ఆవిరి పడితే చర్మం తాజాగా కనపడుతుంది.