Dandruff Remedies: చుండ్రు తగ్గాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.. సాదారణంగా చుండ్రు పోగొట్టటానికి చాలా మంది రసాయనాలు ఉన్న షాంపూ లను వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులను ఉపయోగించి చుండ్రును తగ్గించుకోవచ్చు.
జుట్టును ఒకసారి తడిపాక, అరచేతిలో బేకింగ్ సోడా వేసుకొని మాడును మర్దన చేయాలి. ఇది మాడుపై ఉన్న ఫంగస్ ను నిరోదిస్తుంది. అయితే బేకింగ్ సోడా వాడిన తర్వాత షాంపూ వాడకూడదు. మూడు నుంచి నాలుగు స్పూన్ల కొబ్బరి నూనె తీసుకోని రాత్రి పడుకొనే ముందు మాడుకు బాగా పట్టించాలి.
ఉదయం తక్కువ ఘాడత కలిగిన షాంపూ తో స్నానం చేయాలి. ఈ విధంగా మూడు రోజులకు ఒకసారి చేస్తే మంచి పలితం కనపడుతుంది. రెండు స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకోని మాడుకు బాగా పట్టించి అలా వదిలేయాలి. నిమ్మలో ఉండే ఆమ్ల గుణం చుండ్రు రాకుండా చేస్తుంది.
అల్లం ముక్కను పేస్ట్ చేసి, దానికి కొంచెం తేనే కలిపి మాడుకు పట్టించి, పది నిముషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి. అల్లంలో ఉండే యాంటి ఫంగల్ లక్షణాలు చుండ్రుకు కారణం అయిన బ్యాక్టీరియను తొలగిస్తుంది. అంతేకాక జుట్టును మృదువుగా చేస్తుంది.