Stomach Ache: మీ పిల్లల కడుపునొప్పికి కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. చాలా మంది చిన్న పిల్లల నోటి వెంట తరచూ వినే మాట కడుపునొప్పి అని చెప్పవచ్చు. స్కూల్ మానివేయటానికి,హొమ్ వర్క్ నుండి తప్పించుకోవటానికి ఈ మాట చెప్పుతున్నారని చాలా మంది తల్లులు ఈ సమస్య గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ అలా నిర్లక్ష్యం చేయటం తప్పని నిపుణులు చెప్పుతున్నారు.
వాము
ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ వాము వేసి మరిగించాలి. ఆ నీటిని వడకట్టి చల్లారిన తర్వాత పిల్లలకు ఇస్తే కడుపునొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కడుపునొప్పి వచ్చినప్పుడే కాకుండా అప్పుడప్పుడు కూడా ఈ నీటిని ఇస్తే మంచిది.
పుదినా రసం
గ్లాస్ వేడి నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ పుదినా రసం,కొద్దిగా అల్లం రసం,చిటికెడు నల్ల ఉప్పు కలిపి పిల్లలకు ఇస్తే కడుపునొప్పి నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది.
పెరుగు
నాలుగు స్పూన్ల పెరుగులో కొద్దిగా జీలకర్ర,కొద్దిగా మెంతులు నానబెట్టి పిల్లలతో తినిపించాలి. రోజులో ఈ విధంగా రెండు సార్లు చేస్తే కడుపునొప్పి తగ్గే అవకాశం ఉంది.
వెళ్లుల్లి నూనె
వెళ్లుల్లి నూనెను కొద్దిగా వేడి చేసి పొట్ట మీద సున్నితంగా మసాజ్ చేయాలి. అయితే ఎక్కువగా రబ్ చేయకూడదు. రోజులో రెండు సార్లు ఈ విధంగా చేస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.