Homemade Wax Recipes : నొప్పి లేకుండా.. ఇంట్లోనే వాక్సింగ్ చేసుకోవాలనుకుంటే ఇది మీకోసమే.. పార్లర్ కి వెళ్లి వ్యాక్సింగ్ చేయించుకుంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మన ఇంటిలో దొరికే వస్తువులతో వ్యాక్స్ తయారుచేసుకోవచ్చు.
ముందుగా ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీటిని తీసుకోని అర కప్పు పంచదార దానిలో పోసి పొయ్యి మీద పెట్టాలి. కొంత సేపటికి పంచదార కరుగుతుంది. దీనిలో కొన్ని చుక్కల తేనే,నిమ్మరసం వేసి బాగా వేడిచేయాలి. పది నిముషాలు అలా ఉంచితే ఆ మిశ్రమం చిక్కగా సాగుతున్నట్టుగా దగ్గరకు వచ్చి వ్యాక్స్ లా తయారవుతుంది.
పొయ్యి మీద నుంచి దించి, గంట పాటు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. దీనిని ఒక డబ్బాలో పోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు. ఇంటిలో తయారుచేసిన వ్యాక్స్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో రసాయనాలు ఉండవు. అందువల్ల చర్మానికి హాని చేయవు.
ఇది చర్మం పై ఉన్న వెంట్రుకలను తొలగించటమే కాకుండా తేమని ఇస్తుంది. అలాగే చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ వ్యాక్స్ జుట్టు పెరుగుదలను నిరోదించుట వలన, ఎక్కువ సార్లు వ్యాక్స్ చేయవలసిన పని లేదు.
వ్యాక్సింగ్ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా మాయీశ్చరైజర్ రాయాలి. వెంటనే ఎండలోకి వెళ్ళకూడదు. అలాగే ఎక్కువ వేడి ఉన్న నీటితో స్నానం చేయకూడదు. వ్యాక్సింగ్ చేసిన తర్వాత చర్మం ఎర్రగా మారిన లేదా దురదగా ఉన్నా వెంటనే టాల్కం పౌడర్ రాయాలి.