గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంత మంచిదో మనకు తెలుసు. టీ తాగేసాక ఆ బ్యాగ్స్ తో అందాన్ని పెంచుకోవచ్చు. గ్రీన్ టీ లో టానిన్ అనే అస్త్రిజేంట్ ఉంటుంది. ఇది సాగిన చర్మాన్ని బిగుతుగా ఉండేలా చేస్తుంది. వాడేసిన టీ బ్యాగ్స్ ను కొంత సేపు ఫ్రిడ్జ్ లో ఉంచి చల్లగా అయ్యాక కంటి మీద పెట్టుకుంటే మంచిది.
అలా పెట్టుకోవటం వలన కళ్ళ కింద నలుపు మరియు వాపు తగ్గుతాయి. కళ్ళ అలసట కూడా తగ్గుతుంది. అంతేకాకుండా టీ బ్యాగ్ లోని పొడిలో కొంచెం పంచదార, నీరు కలిపి స్క్రబ్ గా ఉపయోగించవచ్చు. ఈ విధంగా తరచుగా చేస్తే చర్మం మెరుస్తుంది. గ్రీన్ టీ పొడికి సమాన పరిమాణంలో బేకింగ్ సోడా,తేనే కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే మంచి పలితం కనపడుతుంది.
తడి టీ బ్యాగ్ తో కొంతసేపు ముఖాన్ని రుద్దితే చర్మం తాజాగా కనపడుతుంది. టీ బ్యాగ్స్ ని వేడి నీటిలో పది నిముషాలు ఉంచాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలా ఉంచి, మరుసటి రోజు ఉదయం తలకు బాగా పట్టించి, మాడును బాగా మర్దన చేయాలి. ఆ తర్వాత తల స్నానం చేస్తే జుట్టు నిగనిగలాడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.