ఈ చారలని స్ట్రెచ్ మార్క్స్ అని అంటారు. ఇవి కేవలం గర్భాదరణ సమయంలోనే కాకుండా విపరీతంగా బరువు పెరిగినా లేదా తగ్గినా, కొన్ని రకాల స్టెరాయిడ్స్ ను మందుల రూపంలో తీసుకున్నా ఈ సమస్య వస్తుంది. చర్మంలో సాగే గుణం తగ్గటం వలన ఈ చారలు ఏర్పడతాయి. గర్భాదరణ సమయంలో పొట్ట పెరగటం వలన చారలు ఏర్పడతాయి.
వీటిని శాశ్వతంగా నివారించటం సాధ్యం కాదు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు కొన్ని రకాల క్రీం లను వైద్యులు గర్భాదరణ సమయంలో మహిళలకు సూచిస్తున్నారు. వాటి వల్ల చారలు రావని కాదు. కానీ ఆ ప్రభావం కొంత వరకు తగ్గుతుంది.
ఈ చారలు సన్నగా లేదా మందంగా ఉండవచ్చు. ఒకవేళ అవి సన్నగా ఉంటే వాటిని కొన్ని క్రీమ్స్ ఉపయోగించి కనిపించకుండా చేయవచ్చు. మరీ మందంగా ఉంటే కనుక క్రీమ్స్ రాస్తూనే లేజర్ చికిత్స చేయించుకోవాలి. దానిని స్టెప్స్ వారిగా చేయించుకోవాలి. అయినప్పటికి అవి పూర్తిగా తగ్గవు. అయితే ఈ లేజర్ చికిత్సను పిల్లలు వద్దని అనుకునే వారు మాత్రమే చేయించుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.