Tourist family:ఇటీవల చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి, భారీ సంచలనం సృష్టిస్తున్న సినిమాలు బోలెడన్ని ఉన్నాయి. తెలుగు, తమిళం, మలయాళం వంటి అన్ని భాషల్లోనూ అద్భుతమైన కంటెంట్‌తో ఈ మధ్య కాలంలో చాలా చిత్రాలు వస్తున్నాయి.
పెద్ద పెద్ద దర్శకులు సైతం ఈ సినిమాలకు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా తమిళంలో విడుదలైన చిత్రం "టూరిస్ట్ ఫ్యామిలీ". ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు జక్కన్న కూడా రివ్యూ ఇచ్చారు. కథ, కథనం అద్భుతంగా ఉండడంతో ఈ చిత్రం థియేటర్లలో చాలా రోజుల పాటు విజయవంతంగా ఆడింది.
ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో విడుదలవుతుందా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అబిషన్ జీవింత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది.
ఈ చిత్రాన్ని జూన్ 2 నుంచి స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. కాబట్టి, ఈ సినిమాను ఓటీటీలో తప్పకుండా చూసేయండి!