Walking:ముందుకు 10 నిమిషాలు నడిచే కన్నా.. వెనక్కి 3 నిమిషాలు నడిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు. వైద్యులు కూడా రోజూ 4 కిలోమీటర్లు నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని సిఫారసు చేస్తారు. అయితే, ముందుకు నడవడంతో పాటు వెనక్కు నడవడం వల్ల మరిన్ని లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

సాధారణ నడక కంటే వెనక్కు నడవడం ద్వారా అధిక ప్రయోజనాలు ఉంటాయని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఏకాగ్రతను కూడా పెంచుతుందని వారు అంటున్నారు.

వెనక్కు నడవడం సాధారణ నడక కంటే కొంత కష్టతరం. ముందుకు నడిచినప్పుడు కాళ్లపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది, కానీ వెనక్కు నడిచినప్పుడు కాళ్లపై ఒత్తిడి పెరిగి కండరాలు బలోపేతమవుతాయి. ఇది అద్భుతమైన కార్డియో వ్యాయామంగా కూడా పనిచేస్తుంది. 10 నిమిషాలు ముందుకు నడవడం కంటే కేవలం 3 నిమిషాలు వెనక్కు నడిచినా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.

రివర్స్ వాకింగ్ అనేది సాధారణ నడక కంటే ఎక్కువ శ్రమతో కూడుకున్నది. ఇది శరీరం మరియు మెదడు మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది మరియు శరీర బలాన్ని పెంచుతుంది. వెనక్కు నడుస్తున్నప్పుడు దృష్టి నడకపైనే కేంద్రీకృతమవుతుంది, దీనివల్ల ఏకాగ్రత గణనీయంగా పెరుగుతుంది. 

అంతేకాకుండా, బరువు తగ్గడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మానసిక ఆరోగ్యానికి రివర్స్ వాకింగ్ ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పి వంటి సమస్యలకు కూడా ఇది పరిష్కారంగా ఉపయోగపడుతుంది. ఈస్ట్ లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫిజియాలజిస్ట్ జాక్ మెక్‌నమరా కూడా ఈ విషయాన్ని సమర్థిస్తున్నారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top