Beetroot:తక్కువ ధరలో ఎన్నో ప్రయోజనాలు.. ఈ ఒక్క ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోండి..ఆరోగ్యం సరిగ్గా లేకపోతే కోట్ల సంపాదన ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే నిపుణులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచిస్తారు. మెరుగైన ఆరోగ్యం కోసం భారీ ఖర్చులు చేయాల్సిన అవసరం లేదు.
తక్కువ ధరలో లభించే ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అలాంటి వాటిలో బీట్‌రూట్ ఒకటి. రక్తహీనత సమస్య ఉన్నవారికి బీట్‌రూట్ అద్భుతమైన ఆహారం.
ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ బి6, మాంగనీస్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి.
గుండె, మెదడు ఆరోగ్యానికి
బీట్‌రూట్‌లోని పోషకాలు రక్తపోటును నియంత్రించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. సరైన మోతాదులో, సరైన పద్ధతిలో బీట్‌రూట్ తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
అంతేకాకుండా, బీట్‌రూట్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటున్నారా? అయితే బీట్‌రూట్‌ను మీ డైట్‌లో చేర్చుకోండి. ఫైబర్ అధికంగా ఉండే బీట్‌రూట్ జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించడంలో సమర్థవంతంగా ఉంటుంది.
అంతేకాక, బీట్‌రూట్‌లో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని, ఇది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.