Paritala Nirupam: కార్తీకదీపం డాక్టర్ బాబు ఒక్క రోజు పారితోషికం ఎంతో తెలుసా..?

Paritala Nirupam: కార్తీకదీపం డాక్టర్ బాబు ఒక్క రోజు పారితోషికం ఎంతో తెలుసా.. పరిటాల నిరుపమ్ పేరు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ 'కార్తీకదీపం' సీరియల్‌లో డాక్టర్ బాబు లేదా కార్తీక్ అనగానే అందరికీ ఈయన గుర్తుకొస్తారు.

'చంద్రముఖి' సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన నిరుపమ్, ఎన్నో సీరియల్స్‌లో నటించినప్పటికీ, 'కార్తీకదీపం' సీరియల్ తెచ్చిన పేరు, ప్రఖ్యాతలు మాత్రం ఏ ఇతర సీరియల్‌కు సాధ్యం కాలేదు. ఈ సీరియల్ ద్వారా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న నిరుపమ్, నటుడిగా మాత్రమే కాకుండా సీరియల్ నిర్మాతగా కూడా తన సత్తా చాటారు.

నిరుపమ్, తన భార్య మంజులతో కలిసి సీరియల్స్‌లో నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తూ, యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా గణనీయమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అంతేకాకుండా, బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నారు. ఇలా బహుముఖ ప్రతిభతో గుర్తింపు పొందిన డాక్టర్ బాబు రెమ్యూనరేషన్, ఆస్తులకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

పలు నివేదికల ప్రకారం, నిరుపమ్ ఒక్క రోజు సీరియల్ షూటింగ్‌కు సుమారు 40,000 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. బుల్లితెర నటులలో అత్యధిక పారితోషికం అందుకునే నటుడిగా ఆయన గుర్తింపు పొందారు. అలాగే, యూట్యూబ్ ఛానెల్ నుంచి భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

ఇక నిరుపమ్, తన భార్య మంజులతో కలిసి 'శ్రీవల్లి కలెక్షన్స్' పేరిట వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన గ్యారేజ్‌లో కోట్ల రూపాయల విలువైన ఖరీదైన కార్లు ఉన్నాయని సమాచారం. హైదరాబాద్‌లో 80 లక్షల రూపాయల విలువైన ఫ్లాట్, వైజాగ్‌లో 5 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల హైదరాబాద్‌లో మరో కొత్త డూప్లెక్స్ హౌస్ నిర్మాణం కూడా ప్రారంభించారు. ఈ ఇంటికి సంబంధించిన వివరాలను నిరుపమ్, మంజుల దంపతులు తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top