'కింగ్డమ్' సినిమా అన్నదమ్ముల నేపథ్యంలో శ్రీలంకలో జరిగే కథతో రూపొందుతోంది. ట్రైలర్‌తోనే కథ గురించి స్పష్టత ఇచ్చేశారు. విజయ్ దేవరకొండ, సత్యదేవ్‌లతో పాటు విలన్‌గా కనిపించిన ఓ నటుడు కూడా ట్రైలర్‌లో హైలైట్ అయ్యాడు. అతని పేరు వెంకటేశ్ వీపీ. ట్రైలర్‌లో కేవలం రెండు షాట్లలోనే కనిపించినా, అతని ప్రెజెన్స్ గట్టిగా గుర్తింపు తెచ్చింది. ఇతడు మలయాళ చిత్రసీమకు చెందిన నటుడని తెలిసింది. 2014 నుంచి అక్కడ సినిమాల్లో నటిస్తున్నాడు.
వెంకటేశ్ వీపీ మలయాళంలో సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ నటించాడు. 'ఒడియన్', 'వెలిపాడింటే పుస్తకం', 'తట్టుంపురత్ అచ్యుతన్' వంటి సినిమాల్లో కనిపించాడు. తమిళంలో జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన 'రెబల్' చిత్రంలో విలన్‌గా చేశాడు. ఆ సినిమాతోనే 'కింగ్డమ్'లో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఇతని నటన చూస్తుంటే, టాలీవుడ్‌కి మరో కొత్త విలన్ దొరికాడనిపిస్తోంది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. అనిరుధ్ సంగీతం అందించగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. నాగవంశీ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు రెండో భాగం కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే, మొదటి భాగం ఫలితంపై రెండో భాగం ఆధారపడి ఉంటుందని అనిపిస్తోంది.