Ravva Laddu:పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని "రవ్వ లడ్డు".. లడ్డూలు అనేక రకాలుగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. వీటిలో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన లడ్డూలను కొనుగోలు చేసి లేదా తయారు చేసి తింటారు.
అయితే, అన్ని లడ్డూలలో రవ్వ లడ్డూలు చాలా ప్రత్యేకమైనవి. దాదాపు అందరూ వీటిని ఇష్టంగా తింటారు. కొంచెం శ్రమించాలి కానీ, ఇంట్లోనే రుచికరమైన రవ్వ లడ్డూలను సులభంగా తయారు చేసుకోవచ్చు. అందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు. రవ్వ లడ్డూల తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ లడ్డూల తయారీకి కావలసిన పదార్థాలు:
చక్కెర – 1 కిలో
పాలు – అర లీటర్
నెయ్యి – 250 గ్రాములు
ఎండు కొబ్బరి – 1 కాయ
బొంబాయి రవ్వ – 1 కిలో
జీడిపప్పు – 50 గ్రాములు
కిస్మిస్ – 25 గ్రాములు
రవ్వ లడ్డూల తయారీ విధానం:
ఎండు కొబ్బరిని తురిమి పక్కన పెట్టుకోవాలి.యాలకులను మెత్తగా పొడి చేయాలి.బొంబాయి రవ్వను సన్నని మంటపై దోరగా వేయించాలి.
ఒక పెద్ద పాన్‌లో తురిమిన కొబ్బరి, చక్కెర, వేయించిన బొంబాయి రవ్వను కలిపి సన్నని మంటపై ఉడికించాలి.కొద్దిగా పాలు, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలపాలి.మిగిలిన పాలను కూడా పోసి మిశ్రమం దగ్గరగా ఉడికేలా చూడాలి.
నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ నుండి దింపాలి.చేతులకు కొద్దిగా పాలు రాసుకుంటూ మిశ్రమాన్ని లడ్డూలుగా చుట్టాలి.ఇలా చేయడం వల్ల రుచికరమైన రవ్వ లడ్డూలు తయారవుతాయి. ఈ లడ్డూలు రుచిలో అద్భుతంగా ఉండి, అందరినీ ఆకర్షిస్తాయి.