Snake Gourd Curry:ఎంతో ఆరోగ్యకరమైన పొట్లకాయ కూర ఇలా చేశారంటే దాని రుచే వేరు.. పొట్లకాయలు అనేక రకాల కూరగాయల్లో ఒకటి, అయితే చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు. కానీ, పొట్లకాయల్లో అద్భుతమైన పోషకాలు మరియు ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తాయి.
పొట్లకాయలు తినడం వల్ల అధిక బరువు తగ్గుతుంది, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, జీర్ణక్రియ సరిగా జరుగుతుంది, కిడ్నీలు మరియు శరీరం శుభ్రంగా ఉంటాయి. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పొట్లకాయలను కూరగా తయారు చేస్తే, వీటిని ఇష్టపడని వారు కూడా రుచిగా తింటారు. ఇప్పుడు పొట్లకాయ పాలు కూర తయారీ విధానాన్ని తెలుసుకుందాం.
పొట్లకాయ పాలు కూర తయారీకి కావల్సిన పదార్థాలు:
పొట్లకాయ – 1
కొబ్బరి నూనె – 1 టీస్పూన్
ఉల్లిపాయ తరుగు – ¼ కప్పు
మిరపకాయ పొడి – 1 టీస్పూన్
కొత్తిమీర – చిన్న కట్ట
కరివేపాకు – 2 రెబ్బలు
పాలు – ½ కప్పు (మరిగించినవి)
ఉప్పు – తగినంత
తాజా కొబ్బరి తురుము – ¼ కప్పు
జీలకర్ర – ½ టీస్పూన్
పచ్చిమిర్చి తరుగు – 2
ఆవాలు – ¼ టీస్పూన్
ఎండుమిర్చి – 4
పసుపు – ¼ టీస్పూన్
స్టవ్‌పై బాణలి పెట్టి, వేడి అయిన తర్వాత కొబ్బరి నూనె వేసి కాగనివ్వాలి.నూనె వేడి అయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి వేయించాలి.ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి, ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి.
పొట్లకాయ ముక్కలు వేసి మూత పెట్టి ఉడికించాలి.ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఉప్పు, మిరపకాయ పొడి వేసి కలపాలి.తాజా కొబ్బరి తురుము, మరిగించిన పాలు వేసి బాగా కలిపి, మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించాలి.కూర బాగా దగ్గరపడిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆపేయాలి.
ఈ కూరను అన్నం, చపాతీ, పుల్కా లేదా రోటీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన పోషకాలను అందించడమే కాకుండా, శరీరానికి అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది.