weight loss:ఉదయం ఒక గ్లాసు తాగితే చాలు.. 30 రోజుల్లో పొట్ట, బరువు తగ్గటం ఖాయం.. అనేక మంది తమ పొట్టను తగ్గించుకోవడానికి వివిధ టిప్స్‌ను అనుసరిస్తుంటారు. అయినా, చాలా మందికి పొట్ట ఒక అంగుళం కూడా తగ్గదు. అయితే, ఉదయం పరిగడుపున ఒక పానీయాన్ని తాగితే, ఖచ్చితంగా పొట్ట తగ్గుతుంది.
ఎంతోమంది ఉదయం పరిగడుపున నీళ్లు తాగే అలవాటు కలిగి ఉంటారు. కొందరు వేడి నీళ్లను ఎంచుకుంటారు. నిజానికి, పరిగడుపున వేడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి అనేక లాభాలను ఇస్తుంది మరియు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.
మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారికి వేడి నీళ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగితే, జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
బరువు తగ్గాలనుకుంటే, ప్రతిరోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగడం మరచిపోకండి. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచి, జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీనివల్ల పేగులోని కొవ్వు పొరలు తొలగి, కొవ్వు సమస్య నివారించబడుతుంది.
రెగ్యులర్‌గా ఉదయం వేడి నీళ్లు తాగితే, గట్టిపడిన కొవ్వు తగ్గుతుంది. ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. అలాగే, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. తినే ముందు ఒక గ్లాసు వేడి నీళ్లు తాగితే, పోషకాల శోషణ పెరుగుతుంది.
వేడి నీళ్లు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తాయి, దీనివల్ల శరీరం మంచి విశ్రాంతిని పొందుతుంది. ఒత్తిడిని రాగల కార్డిసాల్ హార్మోన్ తగ్గి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పడుకునే ముందు ఒక గ్లాసు వేడి నీళ్లు తాగితే, బాగా నిద్ర పొందవచ్చు.
వేడి నీళ్లు మహిళలకు పీరియడ్స్ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి మరియు కండరాలను సడలిస్తాయి. రక్తప్రసరణ పెరిగి, వాపు, నొప్పి తగ్గి, అసౌకర్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.
గోరువెచ్చని నీళ్లు తాగడం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి, చర్మానికి కాంతిని ఇస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరచి, సహజ గ్లోను పెంచుతుంది. మొటిమలు, ముడతలు వంటి చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.